: శంషాబాద్ వస్తూ ఎయిరిండియా విమానంలో విదేశీ ప్రయాణికుడి మృతి!


ఎయిరిండియా విమానంలో విషాదం చోటుచేసుకుంది. ముంబై నుంచి శంషాబాద్‌ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తున్న ఎయిరిండియా విమానం ఏఐ617 లో ప్రయాణిస్తున్న విదేశీ ప్రయాణికుడు మృతి చెందాడు. అతనిని బ్రెజిల్‌ లోని జబోటికి చెందిన అబ్సిఅడ్నిమిగా అధికారులు గుర్తించారు. గత కొంత కాలంగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన చికిత్స నిమిత్తం హైదరాబాదుకు వస్తున్నారని, మార్గమధ్యంలో గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందారని విమానాశ్రయ సిబ్బంది తెలిపారు. 

  • Loading...

More Telugu News