: మూడేళ్ల చిన్నారికి బ్లడ్ కేన్సర్.. ప్రపంచవ్యాప్తంగా ముందుకొచ్చిన 250 మంది.. రూ. 15 లక్షల విరాళం!


బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్న మూడేళ్ల చిన్నారిని రక్షించుకునేందుకు 20 దేశాలకు చెందిన 250 మంది ముందుకొచ్చారు. 45 రోజుల్లో రూ.15 లక్షలు పోగేసి పాప ప్రాణాలు నిలబెట్టేందుకు తమవంతు ప్రయత్నం చేశారు. ముంబైకి చెందిన ఆద్య బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతోంది. నెల లోపు ఆమెకు బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ చేస్తేనే ప్రాణాలు నిలుస్తాయి. ఇందుకోసం రూ.25 లక్షలు ఖర్చవుతుంది. దీంతో ఆద్య తండ్రి సురేశ్ నాయర్‌కు ఏం చేయాలో పాలుపోలేదు. దీంతో తమకు ఆర్థిక సాయం అందించాల్సిందిగా కనిపించిన ప్రతి ఒక్కరినీ వేడుకున్నారు. ప్రస్తుతం రూ.15 లక్షలు సమకూరడంతో మిగతా సొమ్ము కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారి హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

కుమార్తె ఆపరేషన్‌కు అవసరమైన డబ్బులు సమకూర్చుకునేందుకు సురేశ్ నాయర్ జూన్‌లో ఇంపాక్ట్ గురు వెబ్‌సైట్ సాయంతో సాయాన్ని అర్థించారు. వివిధ దేశాలకు చెందిన 256 మంది స్పందించి విరాళాలు ప్రకటించారు. అలా మొత్తం రూ.15,44,254 సమకూరాయి. తమకు సాయం అందించిన బ్రిటన్, అమెరికా, బ్రెజిల్ తదితర దేశాల ప్రజలకు సురేశ్ కృతజ్ఞతలు తెలిపారు. జీవితంలో వారిని తాను కలుస్తానో, లేదో కానీ వారు అందించిన సాయాన్ని మర్చిపోలేనని సురేశ్ కళ్లలో నీళ్లు తిరుగుతుండగా చెప్పారు.

  • Loading...

More Telugu News