: ‘ఉగ్ర’ దాడిలో అమర్‌నాథ్‌ యాత్రికులు ఆరుగురు మృతి!


అమర్ నాథ్ యాత్రికులు, పోలీస్ బృందంపై ఉగ్రవాదులు దాడి చేసిన సంఘటన దక్షిణ కశ్మీర్ లోని అనంత్ నాగ్ లో ఈ రోజు జరిగింది. ఈ సంఘటనలో ఆరుగురు యాత్రికులు మృతి చెందగా, పలువురు గాయపడినట్టు తెలుస్తోంది. దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోయారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ సంఘటన జరిగిన వెంటనే అదనపు బలగాలు రంగంలోకి దిగాయి. శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిని మూసివేశారు. ఈ దాడి నేపథ్యంలో అమర్ నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు సంబంధిత అధికారుల తెలిపారు.

  • Loading...

More Telugu News