: బండారు దత్తాత్రేయ వాహనాన్ని అడ్డుకోవడంపై మండిపడ్డ కిషన్ రెడ్డి!


సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలకు వెళ్లిన కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ వావానాన్ని అడ్డుకుని ఆయన్ని అవమానించారంటూ
బీజేపీ ఫ్లోర్ లీడర్ కిషన్ రెడ్డి మండిపడ్డారు. స్థానిక డీసీపీ ప్రొటోకాల్ ను ఉల్లంఘించారని ఆరోపించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు ఆయన ఓ లేఖ రాశారు. ఎంపీ కవితతో పాటు ఇతరుల వాహనాలను గుడిద్వారం వరకు ఎలా అనుమతిచ్చారని ఈ సందర్భంగా ప్రశ్నించారు.

స్థానిక డీసీపీ ప్రొటోకాల్ ను ఉల్లంఘించిన కారణంగా దత్తాత్రేయ, అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సతీమణి ఇబ్బంది పడ్డారని అన్నారు. ఆ డీసీపీపై ఇంతవరకూ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని ఆ లేఖలో విమర్శించారు. దత్తాత్రేయకు కమిషనర్, డీసీపీలు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, ఈ ఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News