: రాఘవేంద్రరావుపై తాప్సీ చేసిన వ్యాఖ్యలతో.. తలలు పట్టుకుంటున్న ‘ఆనందో బ్రహ్మ’ సినీ నిర్మాతలు!


సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావుపై హీరోయిన్ తాప్సీ ఇటీవల వెకిలి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 'ఝుమ్మంది నాదం' సినిమా షూటింగులో రాఘవేంద్రరావు సినిమాపై కాకుండా తన బొడ్డుపై కొబ్బరికాయ, పూలు విసరడం మీదే దృష్టిపెట్టాడంటూ ఆమె చేసిన వ్యాఖ్య‌లపై నెటిజ‌న్లు, తెలుగు సినీ అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా మండిప‌డ్డారు. ఇక‌పై ఆమె న‌టించిన‌ సినిమాలు చూడ‌బోమ‌ని తెగేసి చెబుతున్నారు. తాప్సీ మాత్రం తాను చేసిన కామెంట్ల‌పై సారీ కూడా చెప్ప‌డం లేదు. ఈ నేపథ్యంలో తెలుగులో ఆమె నటించిన 'ఆనందో బ్రహ్మ' అనే హారర్ కామెడీ సినిమా విడుదలకు రెడీ అయింది. దీంతో ఆ సినిమాను బహిష్కరించాలని అభిమానులు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. ఈ సినిమాను ఎవరు చూడకూడ‌ద‌ని పోస్టులు చేస్తున్నారు.

అయితే, ఈ సినిమా విషయంలో తాప్సీకి అందాల్సిన పారితోషికం ఇప్ప‌టికే ఆమెకు అందింది. ఇక‌ ఈ సినిమా విడుద‌ల కాక‌పోయినా, అభిమానులు చూడకపోయినా ఆమెకి నష్టం ఏమీ లేదు. ఆమె చేసిన వ్యాఖ్య‌ల కార‌ణంగా త‌మ‌ సినిమా నష్టపోతుందని నిర్మాతలు వాపోతున్నారు. ఈ వివాదం ప‌ట్ల తాప్సీ స్పందించి క్షమాపణలు చెప్పాల‌ని వారు కోరుతున్నార‌ట‌. అయితే తాప్సీ మాత్రం స్పందించ‌డం లేద‌ని స‌మాచారం.

  • Loading...

More Telugu News