: జైలు జీవితం గడిపిన జగన్ తో వదిన ఎలా కాపురం చేస్తోందో షర్మిల తెలుసుకోవాలి: కొల్లు రవీంద్ర


అక్రమాస్తుల కేసులో పద్దెనిమిది నెలలు జైలు జీవితం గడిపిన జగన్ తో, తన వదిన కాపురం ఎలా చేస్తోందో సోదరి షర్మిల తెలుసుకోవాలని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మద్య నిషేధం విధిస్తానని చెప్పిన జగన్, మొట్టమొదట తన పక్కన ఉన్న వాళ్లతో మద్యం మాన్పించాలని, తమ పార్టీ నేతలతో మద్యం వ్యాపారం కూడా మాన్పించాలని ఆయన సూచించారు.

జగన్ కు రాజకీయం చేతగాకనే ప్రశాంత్ కిషోర్ ను తెచ్చుకున్నారని విమర్శించారు. మరో మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ, జగన్ ఆశనిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని, ఆయన అధికారంలోకి రావడమనేది కలగానే మిగిలిపోతుందని అన్నారు. కాగా, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ, మేనిఫెస్టోలను నమ్మి ప్రజలు ఓట్లేసే రోజులు పోయాయని, రాష్ట్ర ఆదాయానికి మించి వైసీపీ హామీలు ఉన్నాయని విమర్శించారు. ఈ హామీలను నెరవేర్చగలమా, లేదా? అనే విషయాన్ని పార్టీ నేతలే ఆలోచించుకోవాలని అన్నారు.

  • Loading...

More Telugu News