: బీహార్ లో ఎడతెరిపి లేకుండా వర్షాలు.. పిడుగుపాటుకు 32 మంది మృతి
కొన్ని రోజులుగా కురుస్తోన్న వర్షాలతో బీహార్‌లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆ రాష్ట్ర రాజధాని పాట్నా సహా రోహ్‌తాస్, వైశాలి, భోజ్‌పూర్, నలందా, బక్సార్ తదితర జిల్లాల్లో పిడుగులు పడడంతో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉరుములు, పిడుగులపై ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తోంది. అందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ను ఉపయోగిస్తామని సర్కారు తెలుపుతోంది. ఏపీలో ఇప్పటికే ఈ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. కాగా, బీహార్‌లో పిడుగుపాటుతో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.