: ఆ జాబితాలో పీవీ సింధు నెం.1, ప్రభాస్ నెం.6!


భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి పీవీ సింధుకి ‘జీక్యూ ఇండియా’ మ్యాగజైన్ విడుదల చేసిన అత్యంత ప్రభావితమైన 50 మంది భారతీయుల జాబితాలో మొదటి స్థానం దక్కింది. 130 కోట్ల జనాభాను దాటిన భారత్‌లో ఒలింపిక్స్‌లో మెడ‌ల్స్ తెచ్చిపెట్టేవారే క‌రవైపోయారు. ఇటువంటి స‌మ‌యంలో బ్యాడ్మింట‌న్‌లో అద్భుతంగా రాణించిన పీవీ సింధు దేశానికి ర‌జ‌త ప‌త‌కంతో తిరిగివ‌చ్చిన విష‌యం తెలిసిందే. అందుకే ఆమె అత్యంత ప్రభావితమైన 50 మంది భారతీయుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక ఈ జాబితాలో బాహుబ‌లి ప్ర‌భాస్ ఆరోస్థానంలో నిలిచాడు. బాహుబ‌లి-1, బాహుబ‌లి-2 సినిమాల‌తో ప్ర‌భాస్ అంత‌ర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

‘జీక్యూ ఇండియా’ మ్యాగజైన్ విడుద‌ల చేసిన ఈ జాబితాను 40 ఏళ్లలోపు వ్యక్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకుని రూపొందిస్తారు. ఇందులో ఈ ఇద్ద‌రు తెలుగువారికే చోటు ల‌భించింది. పీవీ సింధూ మొద‌టి స్థానంలో నిల‌వ‌గా, పంజాబ్ న‌టుడు, గాయ‌కుడు దిల్‌జిత్ దొసంజ్ రెండో స్థానంలో నిలిచాడు. ఇక మూడో స్థానంలో క‌మెడియ‌న్‌ కరణ్ గిల్, నాలుగో స్థానంలో చెఫ్, ఐదో స్థానంలో రెస్టారెంట‌ర్‌ మధు చంద్ర, ఆరో స్థానంలోన‌టుడు ప్రభాస్ నిలిచారు.

  • Loading...

More Telugu News