: నటి భావనపై లైంగిక వేధింపుల కేసులో నటుడు దిలీప్ అరెస్ట్
మలయాళ నటి భావనపై లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ నటుడు దిలీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు విషయమై కొన్ని రోజుల క్రితం దిలీప్ ను విచారణ చేశారు. భావనపై లైంగిక వేధింపుల కేసులో దిలీప్ ప్రమేయం ఉన్నట్టు ఆధారాలు లభించడంతో కేరళ పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు. కాగా, ఫిబ్రవరి 17వ తేదీ రాత్రి తన కారులో వెళ్తున్న నటి భావనను కొందరు అడ్డగించి ఆమె వాహనంలోకి ఎక్కారు.
సుమారు రెండు గంటలపాటు లైంగికంగా వేధించడమే కాకుండా, అశ్లీల ఫొటోలూ తీశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు పల్సర్ సుని అనే వ్యక్తిని, భావన వాహనం డ్రైవర్ మార్టిన్ సహా మొత్తం ఆరుగురిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ కేసు వెనుక పలువురు సినీ పెద్దల హస్తముందని గతంలోనే కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో నటుడు దిలీప్‌ను రెండువారాల కిందట పోలీసులు విచారించారు. చివరకు ఆయన ప్రమేయంపై ఆధారాలు లభించడంతో ఈ రోజు అరెస్ట్ చేశారు.