: తమన్నా కోసం పెళ్లి సంబంధాలు వెతుకుతున్నారట!
టాలీవుడ్లో దాదాపు అందరు అగ్రహీరోలతోనూ నటించిన హీరోయిన్ తమన్నా ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉందట. ప్రస్తుతం ఈ అమ్మడు విక్రమ్ సరసన 'స్కెచ్' చిత్రంలో నటిస్తోంది. మరో రెండు తెలుగు సినిమాలకూ సైన్ చేసింది. తమన్నా నటనతో పాటు తన తండ్రి నగల వ్యాపారంలో సాయం చేస్తుంటుంది. తనకు సమయం దొరికితే నగల డిజైన్లు చేస్తుంది.
ఇటీవలే ఈమె తన సోదరుడి వివాహ నిశ్చితార్థ వేడుకలో డ్యాన్స్ చేసి అందరినీ ఆకర్షించిన విషయం తెలిసిందే. ఇక తమన్నాకు కూడా పెళ్లి చేసేయాలని ఆమె కుటుంబ సభ్యులు భావిస్తున్నారట. ప్రస్తుతం ఈ అమ్మడికి తగిన వరుడి కోసం సంబంధాలు వెతికేపనిలో పడ్డారట. తమ అభిమాన హీరోయిన్‌కి భర్తగా డాక్టర్ వస్తాడో, యాక్టర్ వస్తాడో, బిజినెస్ మ్యాన్ వస్తాడోనని ఈ అమ్మడి అభిమానులు చర్చించుకుంటున్నారు.