: దేవుడు రమ్మంటున్నాడంటూ.. ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు మహిళలు
కంప్యూటర్ యుగంలోనూ మూఢనమ్మకాలు పరాకాష్టకు చేరుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం కరపలో మూఢనమ్మకాలతో ముగ్గురు మహిళలు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆ గ్రామంలోని సత్తి ధనలక్ష్మి, సత్తి వైష్ణవి, రాశంశెట్టి సత్యవతి అనే ముగ్గురు మహిళలు దేవుడు తమని పిలుస్తున్నాడంటూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ధనలక్ష్మి, వైష్ణవి, సత్యవతి మూడు రోజులుగా వింతగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. పూజలు చేస్తూ, దేవుడు తమతో మాట్లాడుతున్నాడని అనే వారని తెలిపారు. దేవుడు తన వద్దకు రమ్మన్నాడంటూ ఈ ముగ్గురు మహిళలు చెప్పేవారని పేర్కొన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.