: పేటీఎం మాల్‌లో కొత్తగా 2000 ఉద్యోగాలు!
ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ పేటీఎం మాల్ తమ మార్కెట్‌ను మరింత విస్తరించుకోవాలని ప్రణాళికలు రూపొందించుకుంది. అందులో భాగంగా తమ వ్యాపారాలు, టెక్నాలజీ విభాగాల్లో సుమారు 2000 కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టనుంది. పేటీఎం మాల్ ఇటీవలే ఎస్‌ఏఐఎఫ్ పార్టనర్, అలీబాబా గ్రూప్ హోల్డింగ్స్ నుంచి సుమారు 200 మిలియన్ డాలర్ల పెట్టుబడులను సేకరించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా పేటీఎం ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ.. తమ మాల్ ద్వారా అధిక మొత్తంలో ఉత్పత్తులను కస్టమర్లకు వారి స్మార్ట్‌ఫోన్ల ద్వారానే అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నామని తెలిపారు. అలాగే లోకల్ షాప్‌కీపర్లు తమ ఉత్పత్తులను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండింటిలోనూ సమాన నిష్పత్తిలో అమ్మకానికి ఉంచేలా చేస్తున్నామని అన్నారు. తమ పేటీఎం మాల్‌లో అన్నిరకాల వస్తువులు ఉంటాయని చెప్పారు. మొత్తం 1,40,000 విక్రయదారులకు చెందిన సుమారు 6.8 కోట్ల ప్రొడక్టులను అందిస్తున్నామని తెలిపారు.