: టీమిండియా కోచ్ పదవిపై కొనసాగుతున్న సస్పెన్స్!


టీమిండియా హెడ్ కోచ్ పదవిలో ఇంతవరకూ ఎవరినీ ఖరారు చేయకపోవడంపై సస్పెన్స్ కొనసాగుతోంది. హెడ్ కోచ్ గా ఎవరిని నియమించాలనే విషయమై క్రికెట్ అడ్వయిజరీ కమిటీ (సీఏసీ) ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. టీమిండియా విదేశీ పర్యటన ముగిశాక కెప్టెన్ కోహ్లీతో ఈ విషయమై చర్చిస్తామని సీఏసీ అంటోంది.

ఈ సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ, హెడ్ కోచ్ ఎంపికకు మరింత సమయం అవసరమని, అంతగా, తొందరపడాల్సిన అవసరమేమీ లేదని అన్నారు. అందరి అభిప్రాయం తీసుకున్నాకే హెడ్ కోచ్ నియామకంపై ఓ నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని గంగూలీ పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం టీమిండియాకు కోచ్ లేరు. ఇటీవల జరిగిన భారత్-వెస్టిండీస్ టూర్ కు కోచ్ లేకుండానే టీమిండియా వెళ్లింది. ఇక, హెడ్ కోచ్ రేసులో రవిశాస్త్రి, వీరేంద్ర సెహ్వాగ్, టామ్ మూడీ, సిమన్స్, పైబస్, రాజ్ పుత్ లు ఉన్నారు.

  • Loading...

More Telugu News