: నాటి లిబియా నియంత గడాఫీతో కత్రినా కైఫ్ ఫొటో.. సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్!


నాటి లిబియా నియంత మహమ్మద్ గడాఫీతో బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ నాడు దిగిన ఓ ఫొటో సామాజిక మాధ్యమాలకు చేరింది. మోడల్ షమితా సింఘా ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. లిబియాలో నాడు నిర్వహించిన ఓ ప్రైవేట్ ఫ్యాషన్ షోకు అతిథిగా గడాఫీ హాజరైన సందర్భంలో అందాల భామలు ఆయనతో ఈ ఫొటో దిగారు.

‘సుమారు పదిహేనేళ్ల క్రితం మేమందరం లిబియాలో జరిగిన ఓ ప్రైవేట్ ఫ్యాషన్ షోలో పాల్గొనేందుకు వెళ్లాం. ఈ సందర్భంగా మిస్టర్ గడాఫీని కలిసే అవకాశం మాకు లభించింది. అమ్మాయిలు! ఓసారి, ఈ ట్రిప్పును గుర్తుచేసుకోండి..’ అని తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో పేర్కొంది. ఈ ఫొటోలో కత్రినా కైఫ్, నటి నేహా ధూపియా, అదితి గోవిత్రికర్, అంచల్ కుమార్ ఉన్నారు. కాగా, లిబియా నియంత గడాఫీ శృంగార పురుషుడని, తన హయాంలో పలువురు అమ్మాయిలతో సంబంధాలు ఉండేవని చెబుతుంటారు. లిబియా సివిల్ వార్ లో రెబెల్ మిలీషీయా చేతుల్లో  2011 అక్టోబర్ 20న గడాఫీ హతమయ్యారు. 

  • Loading...

More Telugu News