: ఆరెస్సెస్ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన శివ్‌రాజ్ సింగ్ చౌహాన్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) వెబ్సైట్ `సేవాగత`ను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ - `అవసరంలో ఉన్న వారిని ఆదుకోవడమే గొప్ప మతం. మంచి పనులు చేసేవారిని మెచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండాలి. అలా చేయడం వల్ల వారికి మరింత ఉత్సాహం కలుగుతుంది` అన్నారు. `ఆరెస్సెస్ జాతి కోసం పని చేసే సంస్థ. సమాజం కోసం నిలబడేవారిని అది తయారుచేస్తుంది. సమాజాన్ని వెలుగుదిశగా పయనించేలా చేయడం కోసం ఆరెస్సెస్ కార్యకర్తలు కృషి చేస్తారు` అంటూ ఆరెస్సెస్‌ను పొగడ్తలతో ముంచెత్తారు శివ్‌రాజ్ సింగ్. సేవాగత వెబ్సైట్ వల్ల వారి కృషి, శ్రమ దేశమంతటా వ్యాప్తి చెంది, అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.