: అలా చెప్ప‌డం ద్వారా జ‌గ‌న్ త‌న అస‌మ‌ర్థ‌త‌ను నిరూపించుకున్నాడు: చంద్రబాబు


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌ ప్ర‌శాంత్ కిషోర్ గెలిపిస్తాడ‌ని ఆ పార్టీ అధినేత‌ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెబుతున్నాడని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వ్యాఖ్యానించారు. అలా చెప్ప‌డం ద్వారా జ‌గ‌న్ త‌న అస‌మ‌ర్థ‌త‌ను నిరూపించుకున్నాడని విమ‌ర్శించారు. ఈ రోజు అమ‌రావ‌తిలో నిర్వ‌హించిన టీడీపీ పార్ల‌మెంట‌రీ స‌మావేశంలో చంద్ర‌బాబు మాట్లాడుతూ... ప్రజ‌లంతా త‌మ‌ ప్ర‌భుత్వ ప‌క్షానే ఉన్నారని అన్నారు. ప్ర‌భుత్వం అమ‌లుప‌రుస్తోన్న‌ అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివరిస్తూ ముందుకు తీసుకెళ‌దామ‌ని పిలుపునిచ్చారు. ప్లీన‌రీలో జ‌గ‌న్ అన్నీ అబ‌ద్ధాలే చెప్పార‌ని అంద‌రికీ తెలుసని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News