: ‘డీజే’ ఆఫీసుపై ‘మెగా’ అభిమానుల దాడి!
ఇటీవల విడుదలైన ‘డీజే: దువ్వాడ జగన్నాథం’ మరో వివాదానికి వేదికైంది. మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’ చిత్రం కన్నా ‘డీజే’ అత్యధిక కలెక్షన్లు సాధించిందంటూ వచ్చిన వార్తలపై ‘మెగా’ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని సాగర్ సొసైటీలో ‘డీజే’ ఆఫీసు ముందు నినాదాలు చేశారు. దీంతో, ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు కంగుతిన్నారు. ఈ విషయమై ‘మెగా’ అభిమానులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్టు సమాచారం.ఈ సంఘటనతో దిల్ రాజు కార్యాలయం వద్ద భద్రత పెంచారు. కాగా, ‘డీజే’ కలెక్షన్లలో తప్పుడు లెక్కలు ఉన్నాయని, కొన్ని వెబ్ సైట్లలో వచ్చిన వార్తలపై డైరెక్టర్ హరీష్ శంకర్ ఇటీవల స్పందిస్తూ, నైజాం ఏరియాలో ఈ చిత్రం రూ.20 కోట్ల కలెక్షన్లు సాధించిందని, ఇది తప్పని ఎవరైనా నిరూపించగలరా? అని సవాల్ విసిరారు.