: కాసేపట్లో కురవనున్న అమెజాన్ ఆఫర్ల వర్షం!
ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ అమెజాన్ ప్రతిష్టాత్మక ఆఫర్ సేల్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. `అమెజాన్ ప్రైమ్ డే సేల్` పేరుతో తమ వీడియో స్ట్రీమింగ్ యాప్ `అమెజాన్ ప్రైమ్` వినియోగదారులకు మాత్రమే ప్రత్యేకంగా ఈ సేల్ నిర్వహిస్తోంది. 499 రూపాయల సంవత్సర చందాదారులకు మాత్రమే ఈ సేల్ ద్వారా లాభం చేకూరనుంది. భారత్‌లో జూలై 10 సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ సేల్ 30 గంటల పాటు కొనసాగనుంది.
ఆరు గంటల కంటే ముందే అనగా 5 గంటల నుంచి ప్రీసేల్ పేరుతో రెడ్‌మీ 4 స్మార్ట్ ఫోన్ల సేల్ ప్రారంభమవుతుందని అమెజాన్ తెలిపింది. ఈ సేల్‌లో ఒక టీవీ కొంటే మరొకటి ఉచితం లాంటి వాటితో పాటు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా వున్నాయి. భవిష్యత్తులో కూడా `అమెజాన్ ప్రైమ్` వినియోగదారుల కోసం ప్రత్యేకంగా సేల్స్ నిర్వహించనున్నట్లు అమెజాన్ ప్రతినిధి తెలిపారు.