: బీసీసీఐ హెడ్ క్వార్టర్స్ కు చేరుకున్న గంగూలీ, లక్ష్మణ్, సెహ్వాగ్


ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్ లో టీమిండియా చీఫ్ కోచ్ ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యాయి. టీమిండియా సలహాదారులు, దిగ్గజ ఆటగాళ్లు సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ తాజాగా బీసీసీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. వారి తరువాత టీమిండియా చీఫ్ కోచ్ పదవికి పోటీ పడుతున్న వీరేంద్ర సెహ్వాగ్ కూడా అక్కడికి చేరుకున్నాడు. ఈ రేసులో రవిశాస్త్రి, టామ్ మూడీ, దొడ్డ గణేష్ తదితరులు ఉన్నారు. వీరిలో రవిశాస్త్రికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. కాగా, రవిశాస్త్రి టీమిండియా డైరెక్టర్ గా పని చేసిన సంగతి, అతనిని తొలగించిన అనంతరం కుంబ్లేను చీఫ్ కోచ్ గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. కెప్టెన్ కోహ్లీతో విభేదాల నేపథ్యంలో కుంబ్లే పదవికి రాజీనామా చేసినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News