: శ్రీదేవి సినిమా చూసొచ్చిన నారా లోకేశ్!
బిజీబిజీగా ఉండే నారా లోకేశ్ కొంత వెసులుబాటు కల్పించుకుని సినిమా చూశారు. ప్రముఖ నటి శ్రీదేవి నటించిన 'మామ్' చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ఈ చిత్రంపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. సినిమా గురించి ట్విట్టర్ ద్వారా తన స్పందనను తెలియజేశారు. "శ్రీదేవి గారి 300వ సినిమా మామ్ చూశా. సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఆమె నటన ఔట్ స్టాండింగ్. సినిమాలో ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేశా" అంటూ లోకేశ్ ట్వీట్ చేశాడు.
మరోవైపు 'మామ్' సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ మంచి వసూళ్లను రాబడుతూ, విమర్శకుల నుంచి సైతం ప్రశంసలను అందుకుంటోంది.