: ఇంకా తెరచుకోని ఎన్ఎస్ఈ... చరిత్రలో ఎన్నడూ లేనంత ఉన్నత స్థాయికి బీఎస్ఈ!


సాంకేతిక సమస్యలతో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లావాదేవీలు నిలిచిపోయిన వేళ, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆల్ టైం రికార్డుకు చేరింది. ఈ ఉదయం మార్కెట్ ట్రేడింగ్ సెషన్ ప్రారంభమైన తరువాత, ఈ మధ్యాహ్నం 12.35 గంటల సమయంలో సెన్సెక్స్ -30 సూచిక 248 పాయింట్లు పెరిగి 31,609 పాయింట్లను తాకింది. దీంతో జూన్ 22 నాటి రికార్డు 31,522 పాయింట్ల రికార్డు చెరిగిపోయింది.

టెక్నాలజీ, ఐటీ, రియాల్టీ, పీఎస్యూ, హెల్త్ కేర్, బ్యాంకుల ఈక్విటీలు భారీ లాభాలను పండించుకున్నాయి. భారతీ ఎయిర్ టెల్ తో పాటు టీసీఎస్, లుపిన్, సన్ ఫార్మా, విప్రో తదితర కంపెనీలు మూడున్నర శాతానికి పైగా లాభపడ్డాయి. ఇన్వెస్టర్లు షార్ట్ పొజిషన్లను కవర్ చేసుకోవడం కూడా లాభాలకు సహకరించిందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. బీఎస్ఈ 100 0.76 శాతం, మిడ్ క్యాప్ 0.45 శాతం లాభాల్లో సాగుతున్నాయి. ఎన్ఎస్ఈలో ఏర్పడిన సాంకేతిక సమస్య మాత్రం తొలగలేదు.

  • Loading...

More Telugu News