: సైనికుడ్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన ట్రంప్!


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశానికి చెందిన ఓ సైనికుడ్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. మేరీలాండ్ లోని ప్రిన్స్ జార్జియా కంట్రీలో ఉన్న ఎయిర్ ఫోర్స్ 11వ వింగ్ ను ట్రంప్ సందర్శించారు. అనంతరం తిరిగి వెళ్తున్న సమయంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సైనికుడి తలపై టోపీ ఎగిరి ట్రంప్ వెళ్లేదారిలో పడింది. దీంతో ఉన్నతాధికారితో మాట్లాడుతూ జోరుగా నడిచిన ట్రంప్, ఒక్కసారి ఆగి ఆ సైనికుడి తలపై టోపీని సరిగ్గాపెట్టి అభినందించారు. అలా అభినందిస్తున్న సమయంలో మరోసారి ఆ టోపీ గాలికి ఎగిరిపోయింది. దీంతో ట్రంప్ ఆ టోపీని తీసి తనతో నడిచి వచ్చిన ఉన్నతాధికారికి ఇచ్చి, అతని తలపై పెట్టమని చెప్పి వెళ్లిపోయారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

  • Loading...

More Telugu News