: దీపికాతో టెన్నిస్ స్టార్ జకోవిచ్ ప్రేమాయణం?
అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు నోవాక్ జకోవిచ్‌కు బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొనే మధ్య కొంతకాలం ఎఫైర్ కొనసాగినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తన భార్య జెలీనాతో వచ్చిన మనస్పర్థల నేపథ్యంలో వారు విడాకులు తీసుకోబోతురన్నారని, ఇందుకు జకోవిచ్ పాత ప్రేమ కథలే కారణమని చెబుతున్నారు.
ఇదే అదనుగా గతంలో జకోవిచ్‌తో సహజీవనం చేసిన సెర్బియన్ పాప్ స్టార్ నటాషా బెక్వాలాచ్ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. జకోవిచ్, బాలీవుడ్ నటి దీపికా పదుకొనేలు డేటింగ్ చేశారని, వారి ఫొటోలు కూడా ఉన్నాయని ఆమె తెలిపింది. కేవలం దీపికాతో మాత్రమే కాకుండా జెలీనాను పెళ్లి చేసుకోవడానికి ముందు జకోవిచ్ చాలా మందితో డేటింగ్ చేశారని నటాషా చెప్పింది.