: చిత్తూరు జిల్లా జాతరలో అపశ్రుతి... అగ్నిగుండంలో పడిపోయిన బాలిక
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కాళహస్తీశ్వరుని దేవాలయానికి అనుబంధంగా ఉన్న ద్రౌపది సమేత ధర్మరాజస్వామి ఆలయం బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఉత్సవాల్లో భాగంగా అగ్నిగుండం ఏర్పాటు చేయగా, ఓ బాలిక ప్రమాదవశాత్తూ అందులో పడిపోయింది. ద్రౌపదీదేవి అలంకారంలో అమ్మవారి ఊరేగింపు తరువాత, వేలాది మంది గుండం ముందు చేరిన సమయంలో అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. తన తల్లితో కలసి గుండంలో నడించేందుకు వచ్చిన బాలిక, జంప్ చేయబోయి అందులో పడిపోయినట్టు తెలుస్తోంది. పక్కనే చూస్తున్న వ్యక్తులతో పాటు నడుస్తున్న మహిళలు వెంటనే స్పందించి పాపను బయటకు లాక్కొచ్చారు. ఆపై ప్రథమ చికిత్స చేసి, ఆసుపత్రికి తరలించారు.