: మేం చిత్తుగా ఓడిపోవడానికి కారణం ఇదే!: కోహ్లీ
వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోలేకపోవడమే వెస్టిండీస్ తో జరిగిన ఏకైక టీ-20 మ్యాచ్ లో తమ ఓటమికి కారణమని భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. చిత్తుగా ఓడిపోవడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసిన ఆయన, మరో 30 పరుగులు అదనంగా చేసుంటే మంచి గెలుపు అవకాశాలు ఉండేవని అభిప్రాయపడ్డాడు. ఓ దశలో 230 వరకూ పరుగులు చేస్తామని అనుకున్నా, విండీస్ కట్టుదిట్టమైన ఫీల్డింగ్ తో పరుగులు రాబట్టడం కష్టమైందని చెప్పాడు.
బ్యాటింగ్ బాగున్నా, ఫీల్డింగ్ లో లోపాలు, వైఫల్యమే ఓటమికి కారణాలయ్యాయని చెప్పాడు. ఈ మ్యాచ్ తరువాత, పరిస్థితులను బట్టి ఎలా స్పందించాలన్న విషయం జట్టు సభ్యులకు అర్థమై ఉంటుందని మ్యాచ్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కోహ్లీ వ్యాఖ్యానించాడు. విండీస్ ఆటగాళ్లు మంచి ప్రతిభను కనబరిచారని, ఈ పర్యటనలో తామెంతో ఎంజాయ్ చేశామని చెప్పాడు.