: లండన్ లో మరో భారీ అగ్నిప్రమాదం!


గత నెలలో వెస్ట్ లండన్ లోని గ్రీన్ ఫీల్డ్ టవర్ లో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదం ఘటన నుంచి తేరుకోకముందే బ్రిటన్‌ రాజధాని లండన్‌ ను మరో భారీ అగ్నిప్రమాదం కుదిపేసింది. ఘటన వివరాల్లోకి వెళ్తే... లండన్ లోని క్యామ్‌ డెన్‌ లాక్‌ మార్కెట్‌ లో గత అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పది అగ్నిమాపక శకటాలతో చేరుకున్నారు. ఒక భవనంలోని మూడు అంతస్తుల్లో మంటలు చెలరేగగా, వేగంగా స్పందించిన సుమారు 70 మంది అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి, మంటలను ఆర్పేశారు.

ఇందులో కేవలం ఆస్తి నష్టం మాత్రమే చోటుచేసుకుందని, ప్రాణ నష్టం సంభవించలేదని తెలిపారు. కాగా, క్యామ్‌ డెన్‌ మార్కెట్‌ ఉత్తర లండన్‌ లోనే ప్రముఖ పర్యాటక స్థలంగా ప్రసిద్ధి చెందింది. అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని, లేని పక్షంలో దగ్గర్లోని రెస్టారెంట్లకు కూడా మంటలు వ్యాపించేవని, అలా జరిగితే పెను ప్రమాదం సంభవించేందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా, గత నెలలో చోటుచేసుకున్న గ్రీన్ ఫీల్డ్ టవర్ అగ్నిప్రమాదంలో 70 మంది సజీవదహనమైన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News