: వైజాగ్ లోని ఏటీఎంల నుంచి 5.5 లక్షల రూపాయల చోరీ!
విశాఖపట్టణంలో ఏటీఎంలను యూపీ గ్యాంగ్ కొల్లగొట్టింది. సుమారు 4 రోజుల్లో 51 సార్లు లావాదేవీలు జరిపిన క్రమంలో సుమారు 5.5 లక్షల రూపాయలు చోరీ చేసిన ఘటన చోటుచేసుకుంది. ఏటీఎం ప్యానల్ బోర్డు తాళం సంపాదించిన దొంగలు... తొలుత ఏటీఎం కార్డును అందులో పెట్టి, లావాదేవీ జరుపుతున్నట్టు వచ్చే సూచనలు ఫాలో అయిన దుండగులు...డబ్బులు వచ్చే సమయంలో ప్యానెల్ తాళంతో ఓపెన్ చేసి ఏటీఎం పవర్ మిషన్ ఆఫ్ చేసి, అప్పటికే ముందుకు వచ్చిన డబ్బును దోచేసేవారు. ఇలా 5.5 లక్షల రూపాయలను కొల్లగొట్టారు. దీనిని గుర్తించిన బ్యాంకు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.