: రంగారెడ్డి జిల్లాలో రాళ్ల దాడి... ప్రాణ భయంతో పరుగులు పెట్టిన ప్రభుత్వాధికారులు
రంగారెడ్డి జిల్లా రాగన్నగూడెంలో పది ఎకరాల భూమిలో డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయం తెలుసుకున్న రాగన్నగూడెం సర్పంచ్ సోదరుడు ట్రాక్టర్లతో ఆ పది ఎకరాల భూమిని దున్నించేసి కబ్జాకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ఆరాతీసేందుకు, ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకునేందుకు అక్కడికి వెళ్లారు. దీంతో వారిని అడ్డుకున్న సర్పంచ్ సోదరుడు.... 'ఎవర్రా మీరు?' అంటూ అధికారులను అడ్డుకున్నాడు. అనంతరం రాళ్ల దాడి చేయడంతో అధికారులు అక్కడి నుంచి ప్రాణ భయంతో పరుగులు తీశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.