: ఫ్లిప్ కార్ట్ లో రేపు క్యాంపస్ కార్నివాల్ ప్రారంభం


ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌ కార్ట్‌ లో రేపు క్యాంపస్ కార్నివాల్ సేల్ ప్రారంభం కానుంది. మూడు రోజులపాటు జరుగనున్న ఈ క్యాంపస్ కార్నివాల్ సేల్ లో వివో స్మార్ట్ ఫోన్లపై ప్రత్యేక ఆఫర్లను అందించనున్నారు. వివో ఫోన్ కొనుగోలు చేసే కస్టమర్లకు 5 శాతం ఇన్‌ స్టంట్ క్యాష్‌ బ్యాక్ తో పాటు 500 రూపాయల విలువ గల 'బుక్ మై షో' వోచర్, ఇంకా గోఐబిబో 2,000 రూపాయల వోచర్‌, పలు ఫోన్లపై 3,000 రూపాయల ఎక్స్‌ ఛేంజ్ ఆఫర్‌ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ వివో విడుదల చేసిన వివో వీ5 ఎస్, వీ5 ప్లస్, వై55 ఎస్, వై53 స్మార్ట్ ఫోన్లపై ఈ ఆఫర్లు వర్తించనున్నాయి. కాగా, ఈ క్యాంపస్ కార్నివాల్ ఈనెల 12 నుంచి 15 వరకు కొనసాగనుంది. 

  • Loading...

More Telugu News