: జియో కస్టమర్ల డేటా లీక్ అయిందా?
జియో అందిస్తున్న పలు ఆఫర్లను ఎంజాయ్ చేస్తున్న వినియోగదారులకు షాకింగ్ న్యూస్ ఇది. జియో కస్టమర్ల డేటా ఆన్ లైన్ లో లీక్ అయిందనే వార్త ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. జియోకు చెందిన వినియోగదారుల సమాచారమంతా ఓ వెబ్ సైట్లో ఉందనే వార్త ప్రకంపనలు పుట్టిస్తోంది. సంబంధింత వెబ్ సైట్ యూఆర్ఎల్ ను కొంతమంది ట్విట్టర్లో కూడా షేర్ చేశారు.
జియో కస్టమర్ల ఫోన్ నంబర్లు, మెసేజ్ లతో పాటు ఫోన్ లోని సమాచారమంతా ఆ వెబ్ సైట్ లో దర్శనమిస్తోందనే వార్తలు దుమారం రేపుతున్నాయి. అయితే, ఈ వార్తలను జియో యాజమాన్యం ఖండించింది. వినియోగదారుల డేటా చోరీకి గురికాలేదని... వదంతులను నమ్మవద్దని ప్రకటించింది. వినియోగదారుల డేటా సురక్షితంగానే ఉందని తెలిపింది. ఈ వదంతులపై విచారణ కొనసాగుతోందని వెల్లడించింది. జియోకు ప్రస్తుతం 1.20 కోట్ల వినియోగదారులు ఉన్నట్టు సమాచారం.