: రామ్ నాథ్ కు మద్దతిస్తే బీజేపీతో లాలూచీ... మీరాకు మద్దతిస్తే, తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్... ఇదేగా మీరనేది?: రోజా


రాష్ట్రపతి, స్పీకర్ తదితర గౌరవ ప్రదమైన పదవులు ఏకగ్రీవంగా ఎన్నిక కావాలన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమతమని ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, బీజేపీతో లాలూచీపడి రామ్ నాథ్ కు మద్దతివ్వడానికి అంగీకరించినట్టు వచ్చిన వార్తలను ఖండించారు. రామ్ నాథ్ పేరు ప్రకటించకముందే, ఏకగ్రీవ ఎన్నిక జరగాలన్న ఉద్దేశంతో, తమ మద్దతు బీజేపీకి ఇస్తామని ముందే చెప్పామని, అంతమాత్రాన చంద్రబాబులా ప్రధాని కాళ్లు పట్టుకుని కేసులపై విచారణ లేకుండా చేసుకున్నట్టు కాదని అన్నారు.

 "విలువలతో కూడిన వ్యక్తికి సపోర్టు చేయాలని అనుకున్నాము. రామ్ నాథ్ కు మద్దతిస్తే, బీజేపీతో లాలూచీ పడ్డారని చెబుతారు. రెండోది కాంగ్రెస్ కు మేం సపోర్టు చేసుంటే మీరేం అంటారు? తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ వీళ్లంతా ఒకటే అంటారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టింది. అలాంటి పార్టీకి ఎందుకు సపోర్టు చేయాలని మేం ప్రశ్నిస్తున్నాం" ఆని అన్నారు. తామేమీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోలేదని, ఓ గౌరవ పదవి ఎన్నికను ఏకగ్రీవం చేయాలన్న ఉద్దేశంలో ఉన్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News