: రోజాతో 'చంద్రబాబును తిట్టమని జగన్ చెబుతున్నారు' అన్న ఉమ్మారెడ్డి... మైక్ ఆన్ లో ఉండటంతో బహిర్గతం!


వైకాపా ప్లీనరీ సమావేశాలు జరుగుతున్న వేళ, డ్వాక్రా మహిళలకు అన్యాయం జరుగుతోందన్న తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు మైక్ ముందుకు ఆ పార్టీ మహిళా నేత రోజా వచ్చిన సమయంలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. రోజా మైకు తీసుకోగానే, పక్కనే ఉన్న సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు "చంద్రబాబును తిట్టమని జగన్ పదిసార్లు చెప్పారు" అని ఆమె చెవిలో చెప్పారు. చుట్టూ సవ్వడి ఎక్కువగా ఉండటంతో, విషయం రోజాకు అర్థం కాక, "ఎవరినీ" అని అడుగగా, "చంద్రబాబును తిట్టాలని జగన్ చెబుతున్నారు" అని అన్నారు. ఆ సమయంలో మైక్ ఆన్ లో ఉండటంతో ఆ మాటలు అందరికీ వినిపించాయి. ఇక ప్లీనరీలో ప్రసంగించిన పలువురు నేతలు, చంద్రబాబును టార్గెట్ చేస్తూ ప్రసంగాలు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News