: ఆ ఫోటో పోస్టు చేసి తప్పు చేశా... మరోసారి అలా చేయను: మాధనవ్ పశ్చాత్తాపం
ప్రముఖ నటుడు మాధవన్ తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో తాను పోస్టు చేసిన ఫోటోపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాడు. తాను తెల్లవారు జామున లేచానంటూ ఇటీవల మాధవన్ ఒక ఫోటోను పోస్టు చేశాడు. ఆ ఫోటో సినీ ప్రముఖులతో పాటు, అభిమానులను కూడా అలరించింది. మళ్లీ యంగ్ గా తయారయ్యావంటూ అభినందనలు వెల్లువెత్తాయి. దీంతో ఆ ఫొటో పోస్ట్ చేసి తప్పు చేశానని, అందుకు పశ్చాత్తాప పడుతున్నానని మాధవన్ వ్యాఖ్యానించాడు.
ఈ నేపథ్యంలో ఫోటో పోస్టు చేసిన నేపథ్యాన్ని మాధవన్ వివరిస్తూ... ‘నేను బరువు తగ్గానో లేదో చెప్పమని నా భార్యని అడిగాను. దానికి ఆమె తగ్గలేదని చెప్పింది. దాంతో నేనే ఓ సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. కానీ దాని వల్ల కలిగే పరిణామాల గురించి ఆలోచించలేదు. నేను ఈ ఫొటోలో ఉన్నట్లు అన్ని సందర్భాల్లో ఉండను. ఇకపై జాగ్రత్తపడతాను’ అంటూ మాధవన్ వివరణ ఇచ్చాడు. కాగా, మాధవన్ 'సఖి', 'రంగ్ దే బసంతి', '13-బి', '3 ఇడియట్స్', తమిళ 'గురు' వంటి సినిమాలతో సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.