: పతంజలి ఎఫెక్ట్! కోకాకోలా నుంచి ఆయుర్వేద ఫ్లేవర్లలో సరికొత్త డ్రింక్.. కోక్ కంటే 40 శాతం చవక!


ఆయుర్వేదిక్ ఉత్పత్తులతో హిందూస్థాన్ యూనీ లీవర్, కోల్గేట్ వంటి అంతర్జాతీయ సంస్థలకు రాందేవ్ బాబాకు చెందిన పతంజలి ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇప్పుడు దేశీయ సంస్థల చూపు సాఫ్ట్ డ్రింక్స్‌పై పడడంతో ప్రపంచంలోనే అతిపెద్ద బేవరేజ్ మేకర్ కోకాకోలా కళ్లు తెరిచింది. భవిష్యత్తులో ఎదురయ్యే పోటీని తట్టుకునేందుకు సరికొత్త ఫ్లేవర్‌లో చవకైన సాఫ్ట్ డ్రింక్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.

కోక్, స్ప్రైట్, ఫాంటాల కంటే 35-40 శాతం చవగ్గా దీనిని అందించేందుకు సమాయత్తమవుతోంది. లెమన్, జీరా, ఆరెంజ్ ఫ్లేవర్లలో వీటిని మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఈ మేరకు కోకాకోలా అధికార ప్రతినిధి ఒకరు ఈ వార్తలను నిర్ధారించారు. కిన్లీ ఫ్లేవర్లతో ఉండే డ్రింక్స్‌ను అభివృద్ధి చేసినట్టు వివరించారు. 250 ఎంఎల్ పెట్ ప్యాక్‌లలో ఆకట్టుకునే ధరల్లో వీటిని విడుదల చేయనున్నట్టు తెలిపారు. తొలుత పైలట్ ప్రాజెక్టుగా కొన్ని ప్రాంతాల్లో వీటిని మార్కెట్లోకి తీసుకొస్తామని, అనంతరం దేశ వ్యాప్తంగా విస్తరిస్తామని వివరించారు.

  • Loading...

More Telugu News