: శ్రీలంకతో టెస్టు‌ల కోసం రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాలకు పిలుపు.. ఈనెల 26న తొలి టెస్ట్


కాలి గాయం కారణంగా గతేడాది అక్టోబరు నుంచి టెస్టులకు దూరమైన మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాలకు సెలక్టర్ల నుంచి పిలుపొచ్చింది. శ్రీలంకతో జరగనున్న టెస్టుల కోసం జట్టులో వారికి చోటు దక్కింది. అభినవ్ ముకుంద్ రిజర్వ్ ఓపెనర్‌గా తన స్థానాన్ని నిలుపుకున్నాడు. మూడో స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ తన స్థానాన్ని పదిలపరుచుకోగా గాయం నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్ కూడా తన నాలుగో అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. శ్రీలంక పర్యటనలో భాగంగా భారత్ మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 ఆడనుంది. మొదటి టెస్ట్ గాలేలో ఈనెల 26న ప్రారంభం కానుంది.

భారత జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), కుల్దీప్ యాదవ్, రోహిత్ శర్మ, ఆర్.అశ్విన్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్ షమీ, చటేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, కేఎల్ రాహుల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), ఇషాంత్ శర్మ, మురళీ విజయ్, ఉమేష్ యాదవ్, అభినవ్ ముకుంద్, హార్దిక్ పాండ్యా

  • Loading...

More Telugu News