: పాదయాత్ర నిర్వహిస్తే ముద్రగడ ఇంటిని ముట్టడిస్తాం: ఏపీ బీసీ సంఘం హెచ్చరిక


కాపులను బీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ పద్మనాభం పాదయాత్ర నిర్వహిస్తే కనుక, ఆయన ఇంటిని ముట్టడిస్తామని ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల ఉదయ్ కిరణ్ హెచ్చరించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాపుల హక్కుల సాధన కోసం ముద్రగడ పద్మనాభం పోరాటం చేస్తే తమకేమీ ఇబ్బందిలేదని, బీసీ జాబితాలో కాపులను చేర్చితే మాత్రం సహించమని హెచ్చరించారు.

 ఈ డిమాండ్ తో ముద్రగడ ఎక్కడ పాదయాత్ర ప్రారంభించినా బీసీ సంఘాలన్నీ సంఘటితంగా ప్రతిఘటిస్తాయని హెచ్చరించారు. తుని ఘటనలో ముద్రగడపై కేసు నమోదు చేశారే తప్పా, చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అటు కాపులను, ఇటు బీసీలను మభ్యపెడుతున్నారే తప్పా, ఏ ఒక్కరికీ స్పష్టమైన వైఖరిని ప్రకటించడం లేదని ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు.

  • Loading...

More Telugu News