: జగన్ తలకిందులుగా తపస్సు చేసినా సీఎం కాలేడు: డిప్యూటీ సీఎం కేఈ


జగన్ తలకిందులుగా తపస్సు చేసినా సీఎం కాలేడని ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఎద్దేవా చేశారు. కర్నూలులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజన్నపాలన తీసుకువస్తామని పదేపదే ఆ పార్టీ నేతలు చెబుతున్నారంటే, గనుల దోపిడీ, భూ కబ్జాలు, లక్షల కోట్ల అవినీతిని మళ్లీ తీసుకురావడమేనని విమర్శించారు. ప్రజాప్రయోజన కార్యక్రమాలు, రాష్ట్రాభివృద్ధి, ప్రత్యేక ప్యాకేజ్ పై ప్లీనరీలో చర్చించాల్సిందిపోయి, చంద్రబాబుపై విమర్శలు చేశారంటూ ఆయన మండిపడ్డారు. జగన్ తాను ముఖ్యమంత్రిని కావాలనుకోవడం గాలిమేడలు కట్టడమేనని విమర్శించారు. చంద్రబాబుపై చేసిన అవినీతి ఆరోపణలను నిరూపిస్తే, కేబినెట్ మొత్తం రాజీనామా చేస్తామని ఈ సందర్భంగా కేఈ సవాల్ విసిరారు.

  • Loading...

More Telugu News