: జగన్ సినిమా అయిపోయింది.. ప్రశాంత్ కిషోర్ కాపాడలేడు: దేవినేని ఉమ
జగన్ ను యూపీ ఓటమి వీరుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాపాడలేడని ఏపీ మంత్రి దేవినేని ఉమ జోస్యం చెప్పారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజన్నరాజ్యం వస్తుందని జగన్ చెబుతున్నారని, దాని అర్థం రాజా ఆఫ్ కరెప్షన్ అని విమర్శించారు. జగన్ లాంటి అవినీతిపరుడు అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యానికి మనుగడ ఉంటుందా? అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ నేతలంతా అవినీతిపరులు, దోపిడీదారులు, కేసుల్లో ఉన్నవాళ్లేనని ఆరోపించారు. జగన్ సినిమా అయిపోయిందని, ఎన్నాళ్లయినా జగన్ లాంటి శాడిస్ట్ కు బుద్ధిరాదని అన్నారు.