: మేము అధికారంలోకి రాగానే 5 ఎకరాల లోపు రైతులకు రూ.50 వేలు ఇస్తాం: జగన్


తాము అధికారంలోకి రాగానే 'వైఎస్సార్ భరోసా' కింద రైతులను ఆదుకుంటామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులు అందరికీ రూ.50 వేలు ఇస్తామని, ఈ మొత్తాన్ని ప్రతి ఏటా నాలుగు విడతల్లో రూ. 12,500  చొప్పున ఇస్తామని చెప్పారు. ఈ మొత్తాన్నినేరుగా రైతుల చేతికే ఇస్తామని, ఏ పంట వేయాలన్నది వారికే వదిలేస్తామని చెప్పారు. వైఎస్సార్ భరోసా కింద ప్రతి రైతుకు ఈ సాయం అందజేస్తామని, కుల,మత, ప్రాంత, వర్గ, రాజకీయాలకు అతీతంగా ఈ సాయం అందిస్తామని చెప్పారు.

దీని ద్వారా 86 శాతం మంది రైతులు అంటే 66 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుందని, మొత్తం రూ.33 వేల కోట్లు ప్రభుత్వం తరపున చెల్లించేలా చేస్తామని, రైతును మళ్లీ స్వర్ణయుగంలోకి తీసుకెళ్తామని జగన్ హామీ ఇచ్చారు. రైతులకు గిట్టుబాటు ధరలను కల్పిస్తామని, రూ.2 వేల కోట్లతో కెలమిటీ ఫండ్ ఇస్తామని, రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, డ్వాక్రా, పొదుపు సంఘాలకు ‘వైఎస్సార్ ఆసరా’ అనే పథకాన్ని తీసుకొస్తామని, సున్న వడ్డీకి రుణాలిస్తాని జగన్ చెప్పారు. 

  • Loading...

More Telugu News