: వైసీపీ అధ్యక్షుడిగా జగన్ ఏకగ్రీవం..సమర శంఖం పూరించిన నేత!
వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడిగా వైఎస్ జగన్ మరోమారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఓ ప్రకటన చేశారు. పార్టీ అధ్యక్షుడిగా జగన్ ఎన్నికైన సందర్భంగా ఆయన్ని పార్టీ నేతలు అభినందించారు. అనంతరం, పార్టీ అభిమానులు అందించిన శంఖాన్ని జగన్ పూరించారు. అంతకుముందు, జగన్ కు తలపాగా పెట్టేందుకు ప్రయత్నించిన తమ పార్టీ నాయకుడి చేతుల్లో నుంచి దానిని తీసుకున్న ఆయన తలకే జగన్ పెట్టడం గమనార్హం. మరో నేత ధనుర్బాణలను అందించగా.. జగన్ వాటిని చేతబట్టగా అభిమానుల చప్పట్టు మార్మోగిపోయాయి.