: కడపలో టీడీపీ నాయకుడు రఘురామిరెడ్డి గుండెపోటుతో మృతి
కడప జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు పప్పిరెడ్డి రఘురామిరెడ్డి (45) గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన బంధువులు, టీడీపీ నాయకుడు వై.శేఖర్ తెలిపారు. నిన్నరాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచారని అన్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా, రఘురామిరెడ్డి మృతిపై టీడీపీ నేతలు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.