: కృష్ణ దేవరాయల కాలం నాటి బావిలో ప్రత్యక్షమైన అభయాంజనేయుడు!
అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో రాయలవారి కాలం నాటి పురాతన బావి పూడిక తీత పనులు సాగుతున్న వేళ, జల అభయాంజనేయస్వామి విగ్రహం ప్రత్యక్షమైంది. ఎన్నో వందల ఏళ్ల నుంచి ఈ విగ్రహం బావిలో ఉండి ఉండవచ్చని భావించిన బోగసముద్రం జల, వన సంరక్షణ సమితి, విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ సొంత డబ్బు, దాతల సహకారంతో పూడికతీత పనులు చేపట్టామని, శనివారం బావిలో కూరుకుపోయిన విగ్రహం కనిపించిందని వారు తెలిపారు. ఆ వెంటనే వేదపండితులు, కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించగా, విషయం తెలుసుకున్న పెనుకొండ వాసులతో పాటు, వారి బంధుమిత్రులు కూడా ఈ విగ్రహాన్ని దర్శించుకుని పూజలు చేస్తున్నారు.