: జేసి దివాకర్ రెడ్డికి నిన్న రాత్రి కూడా సేమ్ అనుభవం... విమానం ఎక్కిన తరువాత దించేసిన స్పైస్ జెట్


ఈ ఉదయం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని ట్రూజెట్ విమానం ఎక్కనివ్వలేదన్న సంగతి తెలిసిందే. ఆయన నిన్న రాత్రి కూడా అదే అనుభవాన్ని ఎదుర్కొన్నారు. స్పైస్ జెట్ విమానంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు టికెట్ బుక్ చేసుకున్న ఆయన, శనివారం రాత్రి ఎయిర్ పోర్టుకు వెళ్లారు. బోర్డింగ్ పాస్ తీసుకుని, విమానంలో ఎక్కి కూర్చున్నారు కూడా. ఆ తరువాత ఆయనపై నిషేధం ఉందని తెలుసుకున్న స్పైస్ జెట్ సిబ్బంది కిందకు దిగాలని కోరడంతో, చేసేదేమీ లేక ఆయన వెనక్కు వచ్చారు. విజయవాడకు వెళ్లాలన్న కోరికతో, ఈ ఉదయం ట్రూ జెట్ విమానంలో టికెట్ బుక్ చేసుకుని మరోసారి భంగపాటుకు గురయ్యారు. ఆయనపై దేశంలోని అన్ని విమానయాన సంస్థలూ నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News