: ఇలాంటి చంద్రబాబు నిప్పా? లేక తుప్పా?: షర్మిల ఘాటైన విమర్శలు


వైకాపా ప్లీనరీ వేదికపై షర్మిల తన పదునైన విమర్శలతో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. "ఈయనకు చేతనైనదల్లా అధికారం అడ్డం పెట్టుకుని, అక్రమంగా సంపాదించిన డబ్బులతో ఎంపీలను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, కార్పొరేటర్లను, ఎవరిని వీలైతే వారిని ఉచ్ఛం, నీచం లేకుండా కొనటం. అడ్డంగా టేపుల్లో 'బ్రీఫ్డ్ మీ' అని, తన గొంతుతో అడ్డంగా దొరికినా, ఈ రోజు వరకూ విచారణ జరగకుండా తప్పించుకు తిరుగుతున్న నాయకుడు చంద్రబాబు. ఇలాంటి చంద్రబాబు నిప్పా? లేక తుప్పా? తుప్పే.  వైఎస్ఆర్ సీపీ బలం ప్రజలకు వైఎస్ఆర్ సీపీపై ఉన్న అభిమానమే. వైఎస్ఆర్ సీపీ బలం ప్రజలకు జగనన్న మీదున్న నమ్మకం. ఈ బలం మరే పార్టీకీ లేదు. ఈ బలం మన సొంతం.

 దేవుని దయ, ప్రజల అండ, వైఎస్ఆర్ సీపీకి పుష్కలంగా వున్నాయి. ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు, మనలో ప్రతి ఒక్కరమూ ఒక్కొక్క బాణమై దూసుకు వెళదాం. విజయం నిశ్చయం. మళ్లీ చెబుతున్నా. ఇచ్చిన మాట తప్పడం మా రక్తంలోనే లేదు. అబద్ధాలు చెప్పడం మాకు చేతకాదు. వైఎస్ఆర్ సీపీ విలువలతో కూడిన పార్టీ. విశ్వసనీయత మా ఊపిరి. వైఎస్ఆర్ సీపీ రైతుల పక్షం, దళితుల పక్షం, గిరిజనుల పక్షం. మైనారిటీల పక్షం. పేదల పక్షం, ప్రత్యేక హోదా పక్షం. రాబోతున్నది రాజన్న రాజ్యం. తేబోతున్నది జగనన్న. దీన్ని సాధ్యం చేయబోతున్నది దేవుని దీవెన. ఇది తథ్యం. సెలవు" అంటూ తన ప్రసంగాన్ని ముగించారు షర్మిల.

  • Loading...

More Telugu News