: మీ ముందే చెబుతున్నా... ఇక నాకు ఓపిక లేదు: చైనా అధ్యక్షుడితో ట్రంప్
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో సమావేశమైన వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా దుందుడుకు వైఖరిపై కీలక వ్యాఖ్యలు చేశారు. జిన్ పింగ్ తో ప్రధానంగా కిమ్ జాంగ్ ఉన్ పైనే చర్చించిన ఆయన, ఆ దేశాన్ని కట్టడి చేయాలని కోరారు. వారి దూకుడును భరించే ఓపిక తనకిక లేదని స్పష్టం చేశారని తెలుస్తోంది. ఏదైనా చేసి, కొరియా అధ్యక్షుడిని కట్టడి చేయాల్సిందేనని ట్రంప్ సూచించినట్టు తెలుస్తోంది.
చాలా సేపు కొరియా కేంద్రంగానే వీరిద్దరి మధ్యా మాటలు నడిచాయని, ఓ చిన్న దేశం జరిపే మిసైల్ పరీక్షలపై అమెరికా వంటి పెద్ద దేశం ఆందోళన చెందడం ఏమిటని ఇంటర్నేషనల్ మీడియా ప్రశ్నించింది. ఓ రకంగా కిమ్ జాన్, అమెరికాను తక్కువగా అంచనా వేస్తున్నట్టూ కనిపిస్తోందని, ఇదే సమయంలో ఓ రకంగా యూఎస్ ఆందోళన చెందడం, ఆయన సాధించిన విజయమేనని విశ్లేషించింది.