: హిందూపురంలో హీరో బాలకృష్ణ ఇంటి ముందు మహిళల నిరసన!
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి ముందు మహిళలు కదం తొక్కారు. ఎమ్మెల్యేగా ఉన్న ఆయన, హిందూపురంకు వచ్చిన సమయంలో బస చేసేందుకు ఓ ఇంటిని అందుబాటులో ఉంచుకోగా, ఆ కాలనీకి దారితీసే రోడ్డు పక్కనే ఓ మద్యం షాపు వెలిసింది. ఇళ్ల మధ్య షాపు పెట్టారని ఆరోపిస్తూ, తొలుత పెనుకొండ రహదారిపై మహిళలు రాస్తారోకో నిర్వహించారు. ట్రాఫిక్ సమస్యలు ఏర్పడటంతో, పోలీసులు వారిని అక్కడి నుంచి బలవంతంగా వెళ్లగొట్టగా, ఒక్కసారిగా బాలకృష్ణ ఇంటి ముందుకు వెళ్లి బైఠాయించి, నినాదాలు చేశారు. ఆ సమయంలో బాలకృష్ణ పీఏతో పాటు, కొంతమంది టీడీపీ నాయకులు అక్కడే ఉండగా, వారంతా వచ్చి మహిళలతో మాట్లాడారు. ఎక్సైజ్ అధికారులను సంప్రదించి, వైన్స్ షాప్ ను మరో చోటికి మార్చేలా చూస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.