: లొంగిపోతారా? లేదా?: ఎమ్మార్పీఎస్ కార్యకర్తలకు డీజీపీ వార్నింగ్


శుక్రవారం నాడు అమరావతి సమీపంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు జరిపిన ఆందోళనలో జరిగిన నష్టంపై ఏపీ డీజీపీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీసు వాహనం దగ్ధం చేయడంపై ఆయన స్పందిస్తూ, ఈ పని ఎవరు చేశారన్న విషయాన్ని తాము గమనించామని, వారంతా వెంటనే లొంగిపోవాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆందోళన జరిగిన ప్రాంతాల్లో ముందుగానే సీసీ కెమెరాలు పెట్టామని, అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని గుర్తించామని తెలిపారు. సమీప గ్రామాల్లోకి ముందుగానే చేరిన వారిని పసిగట్టే విషయంలో పోలీసులు సైతం విఫలమయ్యారని ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆయన, ఎమ్మార్పీఎస్ నిరసనకారుల గురించి తమ వద్ద పూర్తి ఆధారాలున్నాయని తెలిపారు.

  • Loading...

More Telugu News