: హైదరాబాద్‌లో కారు బీభత్సం.. ఇద్దరి మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమం!
హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అక్కడి ఇంజాపురం దగ్గరకు రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి చెట్టుకింద కూర్చున్న వారిపైకి దూసుకెళ్లడంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతులను జంగయ్య, జంగమ్మలుగా గుర్తించారు. ఆ కారును వచ్చీ రాని డ్రైవింగ్ తో ఓ మహిళ నడిపించింది. అది కూడా లర్నింగ్ లైసెన్స్‌తో కారును నడిపినట్లు సమాచారం. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసులో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో గాయాలపాలయిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.