: ఉత్తరకొరియాకు బదులిచ్చేందుకు సిద్ధమైన అమెరికా.. యుద్ధవిమానాలతో ప్రత్యక్ష ఫైర్‌ డ్రిల్‌


అమెరికా నుంచి హెచ్చ‌రిక‌లు వ‌స్తున్న‌ప్ప‌టికీ, మ‌రో దుస్సాహ‌సం చేసి, ఖండాంతర క్షిపణి ప్రయోగాన్ని విజ‌య‌వంతం చేశామ‌ని ఉత్త‌ర‌కొరియా ప్ర‌క‌టించుకున్న విష‌యం తెలిసిందే. వ‌రుస‌గా ప్ర‌యోగాలు చేస్తూ తీవ్ర క‌ల‌కలం రేపుతున్న ఆ దేశంపై అమెరికా సీరియ‌స్ అయింది. ఉత్తరకొరియాకు ఇక బుద్ధి చెప్పాల్సిందేన‌ని అమెరికా భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో దక్షిణ కొరియాలో ఈ రోజు అమెరికా యుద్ధవిమానాలు ప్రత్యక్ష ఫైర్‌ డ్రిల్‌ చేపట్టాయి.

అంతేకాదు, ఉత్తర కొరియా సరిహద్దుకి ఆ విమానాలు అతి సమీపంగా వెళ్లాయి. కొరియన్‌ పెనిన్సులాపై కాసేపు చక్కర్లు కొట్టాయి. ఈ ఘ‌ట‌న‌పై ద‌క్షిణ కొరియా స్పందిస్తూ.. ఉత్త‌ర‌కొరియాకు గట్టిగా బదులిచ్చేందుకే ఈ డ్రిల్‌ చేపట్టినట్లు తెలిపింది. ఈ డ్రిల్‌లో నాలుగు అమెరికా యుద్ధవిమానాలు, ఒక దక్షిణకొరియా జెట్‌ ఫైటర్ పాల్గొన్నాయి. ఉత్త‌ర‌కొరియా ఇటీవ‌ల చేసిన‌ ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగంపై అమెరికాతో పాటు ప‌లు దేశాలు మండిప‌డుతోన్న‌ విషయం తెలిసిందే.                 

  • Loading...

More Telugu News