: అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు తీవ్ర అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఈ రోజు విశాఖపట్నంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఆమె అధిక రక్తపోటు, మధుమేహంతో పాటు, జ్వరంతో కూడా బాధపడుతున్నట్టు వైద్యులు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఆమె ప్రస్తుతం ఇండిపెండెంట్‌గా ఉంటున్నారు.